Prediction based YOUR LAGNA

విభిన్న విషయాలను గూర్చి తెలుసుకోవాలని మీకు ఆసక్తి. దీనికోసం మీరు పుస్తకాలు, తరగతి గదులు, సమావేశాలు ఇలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు. మీకిష్టమైన విషయాన్ని కావలసినంత సమాచారం చెప్పగలిగిన వ్యక్తులను అన్వేషించి కనుక్కొంటారు. ప్రతి వారిని గూర్చి మీకు ఏదొ ఒక అనుమానం వుంటుంది. మీరెవరినీ పూర్తిగా నమ్మరు. పైకి అందరికీ ధైర్యం కలిగిన వారుగా కనిపించినా మీరు ధైర్యవంతులు కాదు. మీరు జీవితంలో చాలా సాధిస్తారు. మీరు సాధించిన విజయాలను ఇతరులు గుర్తించాలని కోరు కుంటారు. మీరు ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మీ మనసు మారడం అసాధ్యం. అన్ని పనులూ సక్రమంగా జరగడం మీకు ఇష్టం. అలా గాక పోతే మీరు సహించరు. ఆరోగ్యవంతమైన శరీరం, అందమైన దంతాలు కలిగి వుంటారు. మీకు వ్యాధులు వచ్చే అవకాశాలు హెచ్చు. మీరు అత్యంత క్లిష్ట పరిస్థితులలో కూడా మానసికంగా ధృఢంగా వుంటారు. మీరు ఏదైనా సమస్యను పూర్తిగా అధ్యయనం చేసాకే దానిని ఎదుర్కోవాలనే నియమంతో పని చేస్తారు. మీరు సమస్యను గూర్చి అందరికీ చెప్పాలన్నపుడు ఎదుటివారు ఏమనుకుంటారు అనేది పట్టించుకోరు. మీకు ఎదురుతిరిగినవారిపై చర్య తీసుకుంటారు- వారెంత దగ్గరివారైనా సరే. ఇతరులు మీ ముఖాన్ని చూసి మీ వయసు అంచనా వెయ్యలేరు. విపరీతంగా ఖర్చు పెటడం మీకు స్వతహాగా ఇష్టం లేదు, కానీ ఎదుటివారికి ప్రదర్శించడానికి విపరీతంగా ఖర్చు పెడతారు. మీ "ఇమేజి" పెంచుకోవడానికి ముందుగా కొన్ని పధకాలను రచించి వాటిని ఇతరుల ముందు అమలుచేస్తారు. మిమ్మల్ని మధుమేహం, క్షయ, వెన్ను నొప్పి వంటి ఆరోగ్యసమస్యలు వేధించవచ్చు.

********************************************************************************************