Predictions based on your Birth star

Predictions based ON BIRTH STAR

మీ జీవితంలో తరచుగా ఒడిదుడుకులు వుంటాయి. అత్యంత క్లిష్ట పరిస్థితులలో కూడా విజయం సాధిండటం ఇది ఇతరులు అసూయకు కారణం అవుతుంది. చాలా సార్లు అదృష్టం మీ వెన్నంటే వుంటుంది. వివిధ విషయాలలో గూర్చి జ్ఞానం సంపాదిస్తారు. ఇతరులకు మంచి సలహాదారులు. చాలా మందికి మీరు సమీకృత స్నేహితులు కాబట్టి వారి మధ్యలో వచ్చే చిన్న చిన్న సమస్యలను తేలికగా పరిష్కరిస్తారు. మీరు చక్కని మధ్యవర్తులు కాబట్టి చక్కగా పరిష్కరిస్తారు. ఎవరి అదుపులోనూ మీరు వుండి పని చేయాలనుకోరు. మీకు స్వాతంత్రం, స్వేచ్చా, ఆత్మగౌరవం కావాలి. మీ ఆర్ధిక పరిస్థితి మీ తెలివితేటలకు, శక్తియుక్తులకూ తగినట్టుగా వుండదు. మీరు దురాశ కలవారుగా కనిపించరు. ఇతరులు మీకు పొగరు అనుకున్నా మీరు చాలా మామూలుగా వుంటారు. ఆరోగ్యవంతమైన, అందమైన వారు.మాటలలోనూ, చేతలలోనూ మంచి వ్యక్తిత్వం కలవారు. పనులన్న్నీ ఒక పధ్ధతి ప్రకారం చక్కగా జరగాలని కోరుకుంటారు. ఇతరుల బాధను పంచుకుంటారు. మీరు అందరూ స్వాగతించే మంచి భూస్వామి. మంచి భోజనప్రియులు. దైవం మీద మీకు మంచి నమ్మకం. కష్టాల్లో ఉన్నపుడు సహాయం చేసిన వారి పట్ల, సలహా ఇచ్చిన వారి పట్ల కృతజ్ఞతతో వుంటారు. మోస పోయే అవకాశాలు ఎక్కువ కావున, మీరు నిజాయితీ కలవారు. మీరు సహాయం చేయాలనుకున్న వ్యక్తిని గానీ, స్నేహితులను కానీ జాగ్రతగా ఎన్నుకోవాలి. మీ నవ్వులో ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంది. మీకు మంచి వైవాహిక జీవితం కలదు. మీరు ఉత్తమ విలువలు పాటించాలి.

********************************************************************************************